News January 8, 2025

BIG BREAKING: ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు

image

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.

Similar News

News August 22, 2025

ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ కృషి అభినందనీయం: చిరంజీవి

image

ఇండస్ట్రీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి, అటు నిర్మాతలు, ఇటు కార్మికులకు సమన్యాయం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ చర్యలు అభినందనీయం. ప్రపంచ చలనచిత్ర రంగానికే హైదరాబాద్‌ను ఓ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. టాలీవుడ్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

News August 22, 2025

ఆగస్టు 22: చరిత్రలో ఈరోజు

image

1922: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: న‌ృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం

News August 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.