News January 8, 2025
విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు సెక్సువల్ హరాస్‌మెంటే: హైకోర్టు
విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు చేయడం లైంగిక నేరం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. KSEBలోని మహిళా ఉద్యోగి పెట్టిన కేసును క్వాష్ చేయాలని మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 2013 నుంచి అతడు వల్గర్‌గా మాట్లాడుతూ అసభ్య మెసేజులు పంపిస్తూ కాల్స్ చేసేవాడు. బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు నేరం కాదని అతడు వాదించగా, మహిళ చూపిన సందేశాల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు ఏకీభవించింది.
Similar News
News January 9, 2025
మేం చేసిన కార్యక్రమాలు నేటికీ చెప్పుకుంటున్నారు: వైఎస్ జగన్
AP: తిరుపతి తొక్కిసలాటపై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మేం అధికారంలో ఉండగా టీటీడీ తరఫున చేసిన పనుల్ని ప్రజలు ఈరోజుకీ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నేడు కనీసం తిండి, నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. చనిపోయిన వారికి కనీసం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచిత వైద్యంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
News January 9, 2025
చంద్రబాబు సహా అందరూ బాధ్యులే: జగన్
AP:తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని YS జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి CM నుంచి TTD ఛైర్మన్, EO, SP, కలెక్టర్ అందరూ బాధ్యులేనని ధ్వజమెత్తారు.
News January 9, 2025
పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్: ఇండియా ర్యాంక్ ఇదే!
ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ 5 స్థానాలు దిగజారింది. 80 నుంచి 85వ స్థానానికి పడిపోయింది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్ శక్తిమంతమైన పాస్‌పోర్ట్ (195 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ)గా నిలిచింది.