News January 8, 2025
అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు

AP: అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News August 16, 2025
‘వార్-2’ రెస్పాన్స్‌పై NTR ట్వీట్

‘వార్-2’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మేము చాలా ప్యాషన్‌తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్-2’ రెండు రోజుల్లో రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సినీవర్గాలు తెలిపాయి.
News August 16, 2025
ఒక్క లైవ్ స్ట్రీమింగ్‌తో రూ.105 కోట్ల విరాళాలు

అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వేలాది మందికి ఏదో విధంగా సాయం చేస్తుంటారు. తాజాగా ఛారిటీ కోసం ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి తన ఫాలోవర్లు సైతం ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా $12,000,000 (రూ.105కోట్లు)కు పైగా విరాళాలు వచ్చినట్లు బీస్ట్ Xలో ప్రకటించారు. పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
News August 16, 2025
ట్రంప్-పుతిన్ భేటీపై జెలెన్‌స్కీ ఫస్ట్ రియాక్షన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుపై ట్రంప్, పుతిన్ నిన్న రాత్రి అలస్కాలో <<17420790>>భేటీ<<>> అయిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. పుతిన్‌తో చర్చించిన విషయాలను ట్రంప్ ఫోన్ చేసి తనకు వివరించినట్లు చెప్పారు. తననూ చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. మరణాలు ఆపడం, యుద్ధం ముగించడంపై సోమవారం వాషింగ్టన్‌లో US అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశం అవుతానని వెల్లడించారు.