News January 8, 2025
ఒకే చోట జేసీ బ్రదర్స్
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకే చోట కనిపించారు. తాడిపత్రిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను వారు తిలకించారు. ప్లేయర్లును ఉత్సాహపరిచారు. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకచోట కనిపించడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Similar News
News January 9, 2025
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్హెచ్‌ఏఐ, రైల్వే, రోడ్లు భవనాలు, అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించి జరిగే సమావేశాలలో ఎన్‌హెచ్ పీడీ హాజరుకావాలని హెచ్చరించారు.
News January 9, 2025
ఆలయాల వద్ద ప్రత్యేక భద్రత: ఎస్పీ
అనంతపురం జిల్లాలో ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. శుక్రవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వచ్చే ప్రజలందరూ పోలీసులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
News January 9, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.