News January 8, 2025
HYD: జైలులోనే డిగ్రీ, పీజీ చేశారు
HYDలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్షిక రిపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2024లో రాష్ట్రంలో జైలుకెళ్లిన వారిలో 750 మంది గ్రాడ్యుయేషన్, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసినట్లుగా పేర్కొంది. జైళ్లలో ఉండి చదువుకోవాలనుకున్న వారికి చెంగిచెర్ల, చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలోని జైళ్లలోనూ అవకాశం కల్పించారు.
Similar News
News January 9, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
News January 9, 2025
21వ తేదీ నుంచి ఎంబీఏ కోర్సుల పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) తదితర కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నామన్నారు.
News January 9, 2025
లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల LLB, LLB ఆనర్స్, ఐదేళ్ల బీఏ LLB, ఐదేళ్ల బీకామ్ LLB, ఐదేళ్ల బీబీఏ LLB తదితర కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.