News January 8, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా సిద్ధం కాని స్టేడియాలు?

వచ్చే నెలలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టోర్నీ ప్రారంభానికి మరో 40 రోజులే ఉన్నా స్టేడియాల మరమ్మతుల్లో PCB తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగే స్టేడియాల్లో సీట్లు, ఫ్లడ్ లైట్లు, ఎన్‌క్లోజర్ సౌకర్యాలు కల్పించలేదని సమాచారం. ఔట్‌ఫీల్డ్, పిచ్‌లు కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. మ్యాచ్‌లు నిర్వహించే లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాల్లో ఇదే పరిస్థితి నెలకొందని టాక్.
Similar News
News November 11, 2025
లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.


