News March 17, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దపీట..

37 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పరకాల – ఇనగాల వెంకట్రామి రెడ్డికి (కుడా చైర్మన్), వరంగల్ పశ్చిమ – జంగా రాఘవ రెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్), మహబూబాబాద్ -బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్), భూపాలపల్లి – ప్రకాష్ రెడ్డి (ట్రేడింగ్&ప్రమోషన్ చైర్మన్)గా నియమించారు.
Similar News
News August 17, 2025
వర్ధన్నపేట: బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

వర్ధన్నపేట మండలం ఇల్లంద సమీపంలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు తుల్లా యాకమ్మ(58)ను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News August 16, 2025
రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండండి: వరంగల్ కలెక్టర్

ఈ నెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లపై ప్రజలను అప్రమత్తం చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
News August 16, 2025
వరంగల్ జిల్లాలో 40 మి.మీ వర్షపాతం నమోదు

వరంగల్ జిల్లాలో గత 24 గంటలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 40.0 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 114.8 మి.మీ, దుగ్గొండిలో 99.5 మి.మీ, నర్సంపేటలో 61.8 మి.మీ, సంగెంలో తక్కువగా 12.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.