News January 8, 2025
HYD: 100పడకల ఆస్పత్రిగా అమీర్‌పేట్ హెల్త్ సెంటర్: మంత్రి
50 పడకల ఆసుపత్రిగా ఉన్న అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సందర్శించి ఆస్పత్రిలో సర్జరీ వార్డ్, గర్భిణీల వార్డ్, ఫార్మసి, చిన్నపిల్లలకు మందులు ఇచ్చే గది, రిజిస్టర్లను పరిశీలించారు.
Similar News
News January 9, 2025
ఓయూలో ఏడుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి
ఉస్మానియా యూనివర్సిటీ పనిచేస్తున్న ఏడుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లను అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏఆర్)లుగా, ఒక ఏఆర్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
News January 9, 2025
21వ తేదీ నుంచి ఎంబీఏ కోర్సుల పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) తదితర కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి, ఎంబీఏ (ఈవినింగ్) అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నామన్నారు.