News January 8, 2025
గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు
TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
Similar News
News January 9, 2025
చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రులకు ఏడాది కాలంలో ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.730 కోట్లనూ చెల్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లనూ 22శాతం పెంచామని గుర్తు చేసింది.
News January 9, 2025
26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన SCR
సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్‌సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్‌లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.
News January 9, 2025
గంభీర్‌పై తివారీ విమర్శలు.. మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు
గంభీర్ స్వార్థపరుడంటూ KKR మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాలో గంభీర్‌కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.