News March 17, 2024
పాకిస్థాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

పాక్ నుంచి వచ్చిన 18మంది హిందూ శరణార్థులకు గుజరాత్ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా కొన్నేళ్లుగా అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.
Similar News
News August 18, 2025
స్పెషల్ సూట్‌కేస్‌లో పుతిన్ మలం.. ఎందుకో తెలుసా?

రష్యా వంటి శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు అతని మలాన్ని సేకరించి సొంత దేశానికి తీసుకొస్తారని ఫ్రాన్స్ జర్నలిస్టులు వెల్లడించారు. స్పెషల్ బ్యాగుల్లో మలాన్ని సేకరించి, వాటిని బ్రీఫ్‌కేసుల్లో తీసుకొస్తారని పేర్కొన్నారు. విదేశీ శక్తులు పుతిన్ వ్యర్థాల శాంపిళ్లతో ఆరోగ్య రహస్యాలు తెలుసుకోకుండా ఇలా చేస్తారట.
News August 18, 2025
రికార్డు స్థాయిలో 23.6సెం.మీల వర్షపాతం

TG: రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట(D) గౌరారంలో అత్యధికంగా 23.6cmల వర్షపాతం నమోదైంది. ములుగు(సిద్దిపేట)లో 18.6cm, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.85cm, పిట్లం(కామారెడ్డి)లో 17.3cm, కౌడిపల్లి(మెదక్)లో 17.2cm, సంగారెడ్డిలో కంగ్టిలో 16.6cm, శంకరంపేట(మెదక్)లో 16.4cm, అడ్డగూడురు(యాదాద్రి)లో 16.4cmల వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.
News August 18, 2025
దేశాన్ని వీడుతున్న మేధావులు!

దేశాన్ని వీడుతున్న వారిలో ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా ఇంజినీర్లు, డాక్టర్లు, JEE ర్యాంకర్లు ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో 2 బిలియన్ డాలర్ల IT మేధస్సును కోల్పోతున్నామని రెడిట్‌లో పేర్కొన్నారు. దీనికి దేశంలోని అవినీతి, రెడ్ టాపిజం(అధికార జాప్యం), వివక్ష కారణమన్నారు. అయితే ఎదుగుదలకు రిజర్వేషన్లే కారణమని భావిస్తే దేశంలోనే ఉంటూ సొంత మార్గాన్ని అన్వేషించుకోవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు.