News March 17, 2024

మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

image

మెదక్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్‌ టికెట్‌ అయినా ఖరారు చేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, మైనంపల్లి టికెట్ పోటీలో ఉండగా అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.

Similar News

News July 8, 2024

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను ఆయా అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తులతో హాజరయ్యారు

News July 8, 2024

ఆషాడ మాసం వచ్చినా.. ఊపులేని వ్యవసాయం..!

image

సరైన వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీటి జాడ కరువైంది. మెదక్ జిల్లాలో జలాశయాల్లో నీరు లేకపోవడంతో పంటల సాగు చేపట్టిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిసారి ఆషాడమాసం వచ్చేసరికి రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులు అన్ని పూర్తి చేసేవారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూ పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనాలు సమర్పించుకునేవారు. కానీ ఈసారి ఆషాడమాసం పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు.

News July 8, 2024

మెదక్ జిల్లాకు 15 మంది ఎంఈవోలు కావలెను!?

image

కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో విద్యను అందిస్తామని ‌ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులపై MEOల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో PS-607, హైస్కూల్స్-124, ZPHSలు-140 ఉన్నాయి. అయితే జిల్లాలో 21 మండలాలుండగా.. కొన్ని మండలాలకు సీనియర్‌ HMలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, 15 MEO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.