News January 9, 2025
తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ ఏమన్నారంటే?
తిరుపతి తొక్కిసలాట దురదృష్టకరమని TTD ఛైర్మన్ BR నాయుడు అన్నారు. విషయం తెలిసిన వెంటనే CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. తిరుపతిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నాయుడు తెలిపారు.
Similar News
News January 10, 2025
తిరుపతి ఘటన.. టీటీడీ జేఈవో బదిలీ
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యుల్ని చేస్తూ టీటీడీ జేఈవో గౌతమిని ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆమెను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలంటూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన నేపథ్యంలో ఇవాళ రివ్యూ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఎస్పీ సుబ్బరాయుడు, గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌ను వెంటనే బదిలీ చేయాలని <<15108745>>ఆదేశించిన<<>> విషయం తెలిసిందే.
News January 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 10, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 10, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.