News January 9, 2025
రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్

రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు.
Similar News
News January 11, 2026
PSLV-C16 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

శ్రీహరికోటలోని ఇస్రోలో సోమవారం ప్రయోగించనున్న PSLV-C16 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1485 కేజీల బరువు గల ఈ ఉపగ్రహాన్ని ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ఈ భూపరిశీలన ఉపగ్రహానికి అన్వేషగా ఇస్రో నామకరణం చేసింది. ఇది నూతన సంవత్సరంలో ఇస్రో ప్రయోగించనున్న మొదటి రాకెట్ ప్రయోగం.
News January 11, 2026
నెల్లూరు: మీకు విద్యుత్ సమస్యలా.?

నెల్లూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం “డయల్ యువర్ ఎస్ఈ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 0861–2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 11, 2026
నెల్లూరు: 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండగా, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సముద్రం సుమారు 20 మీటర్ల వరకు ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.


