News January 9, 2025
సీఎం ఆదేశాలు.. తిరుపతికి బయల్దేరిన ముగ్గురు మంత్రులు

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రులు తిరుపతికి బయల్దేరారు. అక్కడి పరిస్థితులను వారు దగ్గరుండి సమీక్షించనున్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు.
Similar News
News August 19, 2025
అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం ఇదే!

మరికొన్ని రోజుల్లో వినాయక చవితి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ గణపతి విగ్రహం సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేశ్ భాయ్ పాండవ్ దగ్గర ఉంది. 2005లో కాంగోలో లభించిన అన్‌కట్ డైమండ్‌ను ఆయన రూ.29,000తో వేలంలో కొనుగోలు చేశారు. అయితే సహజసిద్ధంగా గణేశుడి ఆకృతి, నాణ్యత కారణంగా ఈ వజ్రం విలువ ఇప్పుడు ₹500 కోట్లకు చేరింది.
News August 19, 2025
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

TG: ‘కాళేశ్వరం’ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను నిలిపేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
News August 19, 2025
వైర్లు కట్.. కేబుల్ ఆపరేటర్ల ఆందోళన

హైదరాబాద్‌లోని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతాపూర్ ఘటనకు <<17452500>>కేబుల్<<>> వైర్లు కారణం కాదని, వాటిలో విద్యుత్ సరఫరా అవ్వదని తెలిపారు. వైర్లు తొలగిస్తే లక్షలమంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లు ఇబ్బంది పడతారని వెల్లడించారు. కేబుల్ వైర్లను కట్ చేయొద్దని డిమాండ్ చేశారు.