News January 9, 2025
పవన్ ‘OG’ టీజర్ విడుదలకు సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్‌కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News November 3, 2025
Photo: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్

భారత మహిళా జట్టు తొలిసారి <<18182320>>ప్రపంచకప్<<>> గెలిచి దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫొటోలకు పోజులిచ్చారు. 2011 నాటి ధోనీ పోజ్‌ను రీక్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ICC ట్వీట్ చేసింది. అంతకుముందు ‘క్రికెట్ అందరి గేమ్’ అని రాసిన టీషర్ట్ ధరించి, కప్‌తో నిద్రిస్తున్న ఫొటోను హర్మన్ షేర్ చేశారు.
News November 3, 2025
ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

TG: పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ PSలో పనిచేస్తున్నారు. ఈరోజు మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని సమాచారం. డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
News November 3, 2025
కరెంట్, రోడ్లు అడిగితే చనిపోతారని చెప్పేవాళ్లు: మోదీ

దశాబ్దాలపాటు బిహార్‌ను కష్టాల్లో ఉంచిందని ఆర్జేడీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీకి అభివృద్ధి వ్యతిరేక చరిత్ర ఉంది. రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని, కరెంటు సరఫరా చేస్తే షాక్‌కు గురై చనిపోతారని ప్రజలకు ఆర్జేడీ నాయకులు చెప్పేవాళ్లు’ అని విమర్శించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించామని, రాష్ట్రానికి వందే భారత్ రైళ్లు, రోడ్లు తీసుకొచ్చామని కటిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు.


