News January 9, 2025
అభివృద్ధికి సహకరిస్తాం.. తాలిబన్ ప్రభుత్వానికి భారత్ హామీ

అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు చేపట్టింది. ఆదేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ దుబాయ్‌లో భేటీ అయ్యారు. అఫ్గాన్ ప్రజలకు మానవతా సాయం కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి IND సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు, చాబహార్ పోర్ట్ వినియోగంపైనా చర్చలు జరిగాయి.
Similar News
News August 18, 2025
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.
News August 18, 2025
యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్‌లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.
News August 18, 2025
వర్షాలు ఎక్కువైతే సెలవులు పొడిగిస్తాం: మంత్రి సంధ్యారాణి

AP: వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే వినియోగించామన్నారు. రాబోయే 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.