News January 9, 2025
లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది: మోదీ చమత్కారం
AP: విశాఖ పర్యటనలో మంత్రి లోకేశ్‌తో PM మోదీ సరదాగా మాట్లాడారు. ‘లోకేశ్.. నీ మీదొక ఫిర్యాదు ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అయింది. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు’ అని చమత్కరించారు. వేదిక వద్ద మోదీని ఆహ్వానించడానికి నిలబడి ఉన్న లోకేశ్ వద్దకు వచ్చిన ఆయన కాసేపు ఆగి ఇలా సరదాగా మాట్లాడారు. కుటుంబంతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించగా త్వరలో వచ్చి కలుస్తానంటూ మంత్రి సమాధానమిచ్చారు.
Similar News
News January 10, 2025
CT: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. SA మంత్రి వినతి
ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్‌ను సౌతాఫ్రికా జట్టు బాయ్‌కాట్ చేయాలని ఆ దేశ స్పోర్ట్స్ మినిస్టర్ గేటన్ మెకెంజీ కోరారు. అఫ్గాన్‌లో అధికారం చేపట్టినప్పటి తాలిబన్ ప్రభుత్వం మహిళా క్రీడలపై బ్యాన్ విధించిందన్నారు. అఫ్గాన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌పైనా ఆంక్షలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాయ్‌కాట్ చేయాలన్నారు. కాగా CTలో భాగంగా ఫిబ్రవరి 21న SA-AFG తలపడనున్నాయి.
News January 10, 2025
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు 3కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అనంతరం వారితో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. పవిత్రమైన ఈరోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
News January 10, 2025
భార్యాభర్తలూ.. పిల్లల ముందు ఈ పనులు వద్దు
ఐదేళ్ల లోపు చిన్నారులు మనం మాట్లాడే మాటలు, చేసే పనులను చూసి చాలా నేర్చుకుంటారు. అందుకే వారి ముందు ఆర్థిక సమస్యల గురించి చర్చించుకోకండి. వారికేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. అలాగే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడకండి. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వారూ అలానే అరిచే అవకాశం ఉంటుంది. ఇక పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే పెద్దవాళ్ల పట్ల గౌరవం చూపకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది.