News January 9, 2025
రెవెన్యూ సదస్సులో 4,560 అర్జీలు: కలెక్టర్

ప.గో.జిల్లాలో 27 రోజులు పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.
Similar News
News February 27, 2026
ఉండి: RRR ను పరామర్శించిన సినీనటుడు మోహన్‌బాబు

క్రీడా పోటీల్లో గాయపడి, ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోహన్ బాబు, రఘురామ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News February 27, 2026
ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
నిజం దాగదు.. RRRపై ఐపీఎస్ సంచలన పోస్ట్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అని ప్రశ్నించారు. అబద్ధాలు బయటపడుతున్నాయని, నిజం ఎప్పటికీ దాగదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


