News January 9, 2025
హెల్మెట్ ధారణలో పురోగతి: హైకోర్టు

AP: ప్రతి 10 మంది ద్విచక్రవాహనదారుల్లో ముగ్గురు హెల్మెట్ ధరిస్తున్నారని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల పురోగతి కనిపిస్తోందని సంతృప్తి వ్యక్తం చేసింది. గత 20 రోజుల్లో రూ.95 లక్షల చలాన్లు వసూలు చేశారని, ఫైన్లు విధించడమూ పెరిగిందని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించకపోవడం జరిగే నష్టాలను పత్రికలు, టీవీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Similar News
News November 1, 2025
ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్‌టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్‌లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్‌పుట్స్‌తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.
News November 1, 2025
సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్‌ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT
News November 1, 2025
తిరుమల కొండపై విశేష పర్వదినాలు

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం


