News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News January 10, 2025
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
‘గేమ్ ఛేంజర్’ బెన్ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 10, 2025
హరీశ్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హరీశ్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ సాక్షులను ప్రభావితం చేయొచ్చని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు.
News January 10, 2025
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.