News January 9, 2025

స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో

image

స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.

Similar News

News January 10, 2025

హరీశ్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హరీశ్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్‌ సాక్షులను ప్రభావితం చేయొచ్చని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు.

News January 10, 2025

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

image

AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.

News January 10, 2025

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు

image

సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్‌కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్‌ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.