News January 9, 2025
కేటీఆర్ ఇంటికి చేరుకుంటున్న BRS నేతలు
TG: ACB విచారణ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్ సోదరి, MLC కవిత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆమెతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Similar News
News January 10, 2025
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
News January 10, 2025
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
‘గేమ్ ఛేంజర్’ బెన్‌ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 10, 2025
హరీశ్ రావు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. హరీశ్ తన ఫోన్ ట్యాప్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ సాక్షులను ప్రభావితం చేయొచ్చని, ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరారు.