News March 17, 2024
ముందుగానే కేంద్రాలకు చేరుకోండి : డీఈఓ

పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు ముందు రోజే కేంద్రాలను సరిచూసుకుంటే మంచిదని సూచించారు. అలాగే, పరీక్ష రోజు కేంద్రాలకు హాల్ టికెట్లతో నిర్ణీత సమయానికి కంటే ముందుగా చేరుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని, అవాంచనీయ ఘటనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
ఖమ్మం: మెరుపు దాడులు.. 20 సిలిండర్లు సీజ్..!

ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు DSO చందన్ కుమార్ తెలిపారు.
సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
News March 13, 2026
ఖమ్మం: వంటగ్యాస్‌పై నిఘా.. అక్రమ వినియోగంపై ఉక్కుపాదం!

ఖమ్మం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. హోటళ్లు, వాణిజ్య సంస్థల్లో వీటిని వాడటం చట్టవిరుద్ధమని, ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరం దాడులు చేయాలని ఆదేశించారు. వినియోగదారులు ఓటీపీ ద్వారానే డెలివరీ తీసుకోవాలని, అక్రమాలపై ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
News March 13, 2026
మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.


