News March 17, 2024
కర్నూలు: ఆరోగ్యశ్రీ పేరుతో భారీ కుంభకోణం.. కేసులు నమోదు

కర్నూలులోని శ్రీగాయత్రీ ఆసుపత్రి నిర్వాహకుడు జిలానీబాషా, జ్యోతి డయాగ్నస్టిక్ మేనేజర్ కిరణ్‌పై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం కేసునమోదైంది. వైఎస్సార్ ఆసరా పథకం కింద 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470మందికి పైగా పక్షవాత రోగులకు చికిత్స చేసినట్లు తప్పుడు నివేదికలతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.రూ.5.28 కోట్లు అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడటంతో ఆసుపత్రి అనుమతిని రద్దు చేశారు.
Similar News
News April 3, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు.!

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.➤కొత్త జంటకు YS జగన్ ఆశీర్వాదం➤కమిటీల్లో అన్ని వర్గాలకు చోటు: YCPనేతలు➤బ్యాడిగ మార్కెట్లో వర్షం.. తడిసిన మిరప➤ కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి➤ నంది అవార్డు గ్రహీతకు సబ్ కలెక్టర్ అభినందన➤ భూములను కబ్జా చేయడానికి వక్ఫ్ సవరణ: మాజీ MLA హఫీజ్➤ కర్నూలు: నాయకులతో జగన్ సెల్ఫీ.!➤ జిల్లాలో దంచికొట్టిన వర్షాలు➤కౌతాళంలో సబ్ కలెక్టర్ పర్యటన.
News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News April 3, 2025
కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.