News January 9, 2025

కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.

Similar News

News January 10, 2026

అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

image

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్‌ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.

News January 10, 2026

సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

image

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.

News January 10, 2026

అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

image

AP: అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. CBN ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదు’ అని తెలిపారు.