News January 9, 2025
బాలకృష్ణలో అలాంటి అహం లేదు: హీరోయిన్
ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నా బిగ్ స్టార్‌ని అనే అహం బాలకృష్ణలో లేదని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారని చెప్పారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాలో తన పాత్ర సాఫ్ట్‌గా ఉంటుందన్నారు. ఈ రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువవుతానని తెలిపారు. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ కానుంది.
Similar News
News January 10, 2025
నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ
TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 10, 2025
చైనాలో మంకీపాక్స్ కొత్త మ్యుటెంట్ కలకలం
ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా మరో బాంబ్ పేల్చింది. మంకీపాక్స్‌కు చెందిన కొత్త మ్యుటెంట్ డిటెక్ట్ అయిందని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించామని, అతడి నుంచి మరో నలుగురికి ఇది సోకిందని చెప్పింది. కాగా గతేడాది కాంగోలో మంకీపాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తాజాగా ఈ వైరస్ చైనాకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 10, 2025
ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.