News January 9, 2025
కొనసాగుతున్న విచారణ.. ప్రశ్నల వర్షం!
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి KTRను విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? నిధులు బదిలీ చేయాలని బలవంతం చేశారా? అని ప్రశ్నలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐలు మాజీ మంత్రిని విచారిస్తున్నారు.
Similar News
News January 10, 2025
ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.
News January 10, 2025
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
News January 10, 2025
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
‘గేమ్ ఛేంజర్’ బెన్‌ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.