News January 9, 2025
NZB: దారుణం.. వీధి కుక్క నోట శిశువు మృతదేహం
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో దారుణ ఘటన ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోర్గం గ్రామంలో రోడ్డుపై ఓ వీధి కుక్క తన నోటితో ఒక మగ శిశువు మృతదేహాన్ని పట్టుకుని పరిగెడుతోంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను తరిమికొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి బొడ్డు తాడు అలాగే ఉండగా పుట్టగానే ఎవరో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Similar News
News January 10, 2025
ఆర్మూర్: హత్య కేసు UPDATE.. ముగ్గురు కొట్టడంతోనే మృతి
ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాత్రి సమయంలో కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, బడే రవి లు డబ్బుల విషయంలో మృతుడు మైలారపు సోమేశ్@ సాయిలు (60) గొడవపడి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలిందని ఆర్మూర్ సీఐ తెలిపారు.
News January 10, 2025
టీయూ: పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.in ను సందర్శించాలన్నారు. విద్యార్థులు గమనించాలని తెలిపారు.
News January 10, 2025
నిజామాబాద్: ‘సెలవులకు వెళ్లేవారు నిబంధనలు పాటించాలి’
సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు తూ.చా తప్పకుండా సూచించిన నిబంధనలు పాటించాలని ఇన్ ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలని సూచించారు. సీసీ కెమెరాలు ఆన్‌లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలన్నారు.