News January 9, 2025

HYD: AIDS వచ్చిన వారిని వెలివేస్తే జైలు శిక్ష..!

image

HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.

Similar News

News April 18, 2026

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.