News January 9, 2025
వెంటిలేటర్‌పై ఎవరూ లేరు: సత్యకుమార్
AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్‌పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇంకా 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News January 10, 2025
HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ సీపీ సూచనలు
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ రివ్యూ&రేటింగ్
నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ. సామాజిక కార్యకర్తగా, IASగా రామ్ చరణ్ మెప్పించారు. SJ సూర్య యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. BGM పర్వాలేదు. ‘జరగండి జరగండి..’ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్. కామెడీ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది. డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైంది.
RATING: 2.5/5
News January 10, 2025
20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.