News January 9, 2025

మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి 

image

మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2025

హనుమకొండ: ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్

image

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హౌజ్‌బుజుర్గ్‌ గ్రామానికి చెందిన కమలాకర్(37) పరకాల డివిజన్‌లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా, ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News January 10, 2025

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష

image

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

News January 10, 2025

అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.