News January 9, 2025
బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్

భారత క్రికెట్కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News January 6, 2026
అన్నింటికీ మూడు.. ఉండాల్సిందేనా..?

గతంలో 2గం.–2:30గం. మధ్య ఉండే సినిమా రన్టైమ్ ట్రెండ్ బాహుబలి తర్వాత మారింది. పెద్ద హీరోల మూవీలు చాలా వరకు 3గం. దాటి లేదా ఆ దగ్గర డ్యూరేషన్తో వస్తున్నాయి. ఈ ఫార్ములాతో స్క్రీన్ప్లేను సాగదీసి ప్రేక్షకులకు బోర్ కొట్టించిన, బోల్తాపడ్డ సినిమాలూ ఉన్నాయి. ఓ హీరో 3hr.తో వచ్చారని మరో హీరో, ఫ్యాన్స్ ఒత్తిడి లాంటి కారణాలతో లెంగ్త్ పెరుగుతోంది. కానీ అంతసేపు చూసే మూడ్ ప్రేక్షకులకూ ఉండాలిగా. ఏమంటారు? Comment
News January 6, 2026
స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు: ఆర్టీసీ

AP: సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో జిల్లాల్లో 8,432 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. పండుగకు ముందు HYDకు 240, బెంగళూరుకు 102, చెన్నైకి 15 బస్సులు, పండుగ తర్వాత HYDకు 2,028, బెంగళూరుకు 278, చెన్నైకి 70 బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.
News January 6, 2026
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ఎవరికో మూడినట్లే 1/2

వెనిజులాపై US <<18751661>>దాడి<<>> చేసిన నేపథ్యంలో ‘పెంటగాన్ పిజ్జా థియరీ’పై చర్చ జరుగుతోంది. US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఉంది. వెనిజులాపై దాడి చేసిన సమయంలో 90 నిమిషాలు విపరీతంగా ఆర్డర్లు వచ్చాయట. 1989లో పనామాపై అమెరికా దాడి, 1990లో కువైట్పై ఇరాక్ దాడి, 2022 ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వంటి ప్రధాన సంఘటనల టైమ్లో పిజ్జా ఆర్డర్లు పెరిగాయట.


