News March 17, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోని ప్రచార హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలన్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
Similar News
News December 27, 2024
విమానంలోనే ప్రెస్‌మీట్.. ఇది మన్మోహన్ స్టైల్
సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ తనను ప్రస్తావించడాన్ని మన్మోహన్ సింగ్ ఖండించేవారు. తాను మిగతావారిలా మీడియాతో మాట్లాడేందుకు భయపడేవాడిని కాదని చెప్పేవారు. విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఏ అంశాన్ని మీడియా లేవనెత్తినా అనర్గళంగా మాట్లాడేవారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా 117 సార్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. విదేశాల్లోనూ ప్రెస్‌తో మాట్లాడేవారు.
News December 27, 2024
సుజుకీ మాజీ ఛైర్మన్ కన్నుమూత
సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈనెల 25న మరణించారు. జపాన్‌లో 1930లో జన్మించిన ఓసాము 1958లో సుజుకీలో చేరారు. తక్కువ కాలంలోనే సంస్థకు గుర్తింపు తీసుకొచ్చారు. దాదాపు 21 ఏళ్ల పాటు సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం భారత్‌లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.
News December 27, 2024
రేపు ఈ పనులు చేయకండి
శని త్రయోదశి(రేపు) రోజున శనీశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. రేపు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను అవమానించడం, ఇనుముతో కూడిన వస్తువులు దానం చేయడం, పాదాలతో ఎవరినైనా తాకడం, మాంసం తినడం, మద్యం సేవించడం వంటివి చేయొద్దని అంటున్నారు. నలుపు దుస్తులు ధరించడం, పేదలకు ఆహారం, నల్ల నువ్వులు దానం చేయడం, శని చాలీసా పఠనం వంటివి చేయమని సూచిస్తున్నారు.