News January 9, 2025

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 10, 2025

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం, NHAIకి SC నోటీసులు

image

ఇటీవల TG, రాజస్థాన్‌లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీం కోర్టు విచారించింది. NHల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, NHAIని ఆదేశించింది. రోడ్లపై వాహనాల పార్కింగ్ వల్లే ఈ ప్రమాదాలని జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిలో ఆయా రాష్ట్రాల CSలనూ పార్టీగా చేర్చాలని పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో TGలో 19మంది, రాజస్థాన్‌లో 18మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

News November 10, 2025

ధర్మేంద్ర హెల్త్‌పై రూమర్స్.. టీమ్ క్లారిటీ

image

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ <<18162519>>ధర్మేంద్ర<<>> ఇటీవల శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిని నటుడి టీమ్ ఖండించింది. ‘ఆయన కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఆస్పత్రికి రొటీన్ చెకప్‌కు వెళ్లగా ఇలాంటి వార్తలు వచ్చాయి’ అని క్లారిటీ ఇచ్చారు.

News November 10, 2025

న్యూస్ రౌండప్

image

*రేపు HYD ఘట్కేసర్ NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
*దేవాలయాల్లో తొక్కిసలాట నివారణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
*శంషాబాద్ విమానాశ్రయంలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. 2.70 లక్షల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
*లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు