News January 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ X ఫ్యాక్టర్ అవ్వగలడా?

image

ICC ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ టీమ్ఇండియాకు X ఫ్యాక్టర్‌గా మారగలడని కొందరు అంచనా వేస్తున్నారు. ODI వరల్డ్‌కప్ మాదిరిగా ఇక్కడా మిడిలార్డర్‌లో రాణించగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేశవాళీ క్రికెట్లో అతడు మెరుపులు మెరిపించాడని గుర్తుచేస్తున్నారు. 4 రంజీ మ్యాచుల్లో 90.90 సగటుతో 452, SMATలో 49.28 సగటుతో 345, విజయ్ హజారేలో 5 మ్యాచుల్లోనే 325 రన్స్ చేశాడని అంటున్నారు. మరి మీరేమంటారు?

Similar News

News January 10, 2025

కాంగ్రెస్, BRS మధ్య ‘బ్లాక్ బ్యాగ్’ విమర్శలు!

image

TG: ‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఒక నల్ల బ్యాగు ACB ఆఫీసులో ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి’ అంటూ BRS ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన T కాంగ్రెస్ ‘ఆ నల్ల బ్యాగులో 2014 నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది. ఆ బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నాడా KTR? BRS దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. KTR విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చింది.

News January 10, 2025

లిక్కర్ కంపెనీలకు, ప్రభుత్వానికి సంబంధమేంటి?

image

TG: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో UB కంపెనీ మద్యం సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. లిక్కర్ కంపెనీలు తమ బ్రాండ్లను నేరుగా దుకాణాలకు సరఫరా చేయలేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిపోలకు మాత్రమే పంపాలి. డిపోల నుంచి రిటైల్ వ్యాపారులకు మద్యం చేరుతుంది. కంపెనీలు డబ్బుల కోసం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాలి. అటు వినియోగదారుడు కొనే బీరు ధరలో 16% తయారీ ఖర్చు ఉండగా 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయి.

News January 10, 2025

స్కూళ్లకు సెలవులు షురూ

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. స్కూళ్లకు నేటి నుంచి సెలవులు మొదలయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అటు తెలంగాణలోని స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.