News January 9, 2025
అవినీతి ఎక్కడ జరిగింది?: KTR
TG: తనపై పెట్టింది రాజకీయ కక్షపూరిత కేసు అని KTR మరోసారి చెప్పారు. ‘నేను పైసలు పంపాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇదే విషయం అధికారులను అడిగాను. అసంబద్ధ కేసులో నన్ను ఎందుకు విచారిస్తున్నారని అధికారులను ప్రశ్నించా. విచారణకు ఫార్ములా సంస్థను ఎందుకు పిలవలేదని అడిగా. ACB అధికారుల నుంచి సమాధానం లేదు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News January 10, 2025
సంక్రాంతి బస్సులపై ఇక్కడిలా.. అక్కడలా!
సంక్రాంతికి APSRTC 7,200, TGSRTC 6,432 బస్సులు నడుపుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉండేలా చర్యలు తీసుకుంటామంది. అటు, TGSRTC స్పెషల్ సర్వీసుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్వీసుల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.
News January 10, 2025
ఇంటర్ విద్యార్థి.. స్కూళ్లకు 23 సార్లు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇటీవల వచ్చిన 23 బాంబు బెదిరింపులను ఓ క్లాస్ 12 విద్యార్థి పంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గతంలోనూ అనేక బెదిరింపు సందేశాలు పంపినట్టు సదరు విద్యార్థి అంగీకరించాడని డీసీపీ సౌత్ అంకిత్ చౌహాన్ తెలిపారు. పరీక్షలు రాయకుండా తప్పించుకోవడానికే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి పరీక్షలు రద్దు చేస్తారని భావించినట్లు చెప్పారు.
News January 10, 2025
ఈ ముగ్గురిలో కీపర్‌గా ఎవరైతే బాగుంటుంది?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. KL రాహుల్, పంత్, శాంసన్‌లు పోటీలో ఉన్నారు. వీరిలో ఇద్దరికి స్క్వాడ్‌లో చోటు దక్కే ఛాన్సుంది. ODIల్లో KL 77 మ్యాచుల్లో 49.15 avgతో 2,851 రన్స్ చేయగా, పంత్ 31 మ్యాచుల్లో 871 (33.50), శాంసన్ 16 మ్యాచుల్లో 510 (56.66) పరుగులు చేశారు. వీరిలో ఎవరిని తుది జట్టులో ఆడిస్తే బాగుంటుంది?