News January 9, 2025
ఓయూ అధ్యాపకుల ప్రమోషన్లకు నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
Similar News
News January 10, 2025
HYD: సైబర్ నెరాలపై సరికొత్తమోసం.. ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనర్
జంపేడ్ డిజిటల్‌తో జాగ్రత్త! అని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా.. ఈ స్కామ్‌కి సంబంధించి అవగాహన కల్పించే ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. అజ్ఞాత వ్యక్తుల నుంచి యూపీఐ(UPI) నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వస్తే తెగ సంబరపడిపోకండి అని అన్నారు. ఆత్రుతగా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేశారో.. అంతే.. మీ ఖాతా గుల్ల అవుతుంది అని తెలిపారు.
News January 10, 2025
HYD: జనవరి 31న పిల్లలకు నుమాయిష్ ఎగ్జిబిషన్ FREE
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా కొనసాగుతోంది. జనవరి 31న పిల్లలకు ‘స్పెషల్ డే’గా ప్రకటించారు. పిల్లలు ఉచితంగా వెళ్లే అవకాశం కల్పించారు. కాగా, ఇటీవల జనవరి 9న లేడీస్ ‘స్పెషల్ డే’గా నిర్వహించిన సంగతి తెలిసింది. ఈసారి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది.
News January 10, 2025
HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ సీపీ సూచనలు
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.