News January 9, 2025

మార్కాపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మార్కాపురం కోమటికుంట – జమ్మనపల్లి రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ లారీ ఢీకొట్టి 100 అడుగుల దూరం వరకు ఈడ్చుకొని వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2025

ఆఫీస్‌కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

image

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.

News November 4, 2025

ప్రకాశం: ఉచితంగా 3 వీలర్ మోటారు సైకిల్స్‌.. అప్లై చేయండిలా.!

image

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులన్నారు.

News November 4, 2025

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

image

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.