News January 9, 2025
14న ఢిల్లీకి సీఎం రేవంత్.. అక్కడి నుంచే విదేశాలకు
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఆయన రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. 19న సింగపూర్ నుంచి దావోస్‌కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరవుతారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండగా రద్దయ్యింది.
Similar News
News January 10, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
News January 10, 2025
బీజేపీ నేత ఇంట్లో మొసళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్
మధ్యప్రదేశ్‌కు చెందిన BJP Ex MLA హర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయగా ₹3 కోట్ల డబ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొసళ్లు దొరకడంతో IT అధికారులు అవాక్కయ్యారు. సాగర్ నగరంలో హర్వంశ్ సింగ్‌తోపాటు బీడీ వ్యాపార భాగస్వామి రాజేశ్ కేశర్వాని ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు అధికారులు వెల్లడించారు. రాజేశ్ ఒక్కడే ₹140 కోట్లు ఎగ్గొట్టినట్టు తెలిపారు.
News January 10, 2025
నేడు హైదరాబాద్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా తిరుపతి తొక్కిసలాటతో మేకర్స్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.