News January 9, 2025

26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన SCR

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్‌సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్‌లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.

Similar News

News January 10, 2025

బీజేపీ నేత ఇంట్లో మొస‌ళ్లు.. ఐటీ అధికారులకు మైండ్ బ్లాంక్‌

image

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన BJP Ex MLA హ‌ర్వంశ్ సింగ్ ఇంట్లో రైడ్ చేయ‌గా ₹3 కోట్ల డ‌బ్బు, బంగారం-వెండి, బినామీ కార్లతోపాటు 3 మొస‌ళ్లు దొర‌క‌డంతో IT అధికారులు అవాక్క‌య్యారు. సాగ‌ర్ న‌గ‌రంలో హ‌ర్వంశ్ సింగ్‌తోపాటు బీడీ వ్యాపార భాగ‌స్వామి రాజేశ్ కేశ‌ర్వాని ఇళ్ల‌లోనూ సోదాలు నిర్వ‌హించారు. వీరు ₹155 కోట్ల పన్ను ఎగ్గొట్టిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. రాజేశ్ ఒక్క‌డే ₹140 కోట్లు ఎగ్గొట్టిన‌ట్టు తెలిపారు.

News January 10, 2025

నేడు హైదరాబాద్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా తిరుపతి తొక్కిసలాటతో మేకర్స్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

News January 10, 2025

విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు

image

యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన కామెంట్స్ చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పటి కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 WCలు గెలిచిన, క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన యువీకి టైమ్ ఇవ్వలేదు’ అని తెలిపారు.