News January 10, 2025
90 గంటల పని వ్యాఖ్యలు.. షాకింగ్‌గా ఉందన్న దీపిక
వారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ <<15106710>>వ్యాఖ్యలపై<<>> హీరోయిన్ దీపికా పదుకొణే స్పందించారు. ‘సీనియర్ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.
Similar News
News January 10, 2025
సినిమాల స్పెషల్ షోలకు అనుమతిపై పునః సమీక్షించండి: హైకోర్టు
TG: సినిమాల ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతినివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘గేమ్ ఛేంజర్’ టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోలకు అనుమతులివ్వడం ఏంటని ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమీక్షించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
News January 10, 2025
SHOCKING: ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.
News January 10, 2025
ఢిల్లీ పొలిటికల్ దంగల్‌కి నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. Jan 17 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. అధికార ఆప్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖరారు చేసి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒకే విడతలో Feb 5న జరగనున్న ఎన్నికల కోసం ఆయా పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.