News January 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 10, 2025

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘గేమ్ ఛేంజర్’ HD ప్రింట్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను పైరసీ వెంటాడింది. రూ.450+ కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే HD ప్రింట్‌లో అందుబాటులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది హార్ట్ బ్రేకింగ్ అంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లలో సినిమా చూడండి.

News January 10, 2025

ఢిల్లీ పొలిటికల్ దంగల్‌కి నోటిఫికేష‌న్ విడుదల

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ రోజు నుంచి నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభంకానుంది. Jan 17 నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ. అధికార ఆప్‌, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపికను దాదాపుగా ఖ‌రారు చేసి ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. ఒకే విడతలో Feb 5న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కోసం ఆయా పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 8న ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

News January 10, 2025

అది నిరూపిస్తే నేను పేరు మార్చుకుంటా: అశ్విన్

image

రిషభ్ పంత్ దూకుడైన ఆటతో పాటు డిఫెన్స్ బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. BGTలో పంత్ పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడనే విమర్శల నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు స్పందించారు. అతను డిఫెన్స్ చేస్తూ 10సార్లు ఔట్ అయిన క్లిప్ చూపిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. పంత్ డిఫెన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదని కొనియాడారు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పారు.