News March 17, 2024
అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక నేపథ్యం ఇదీ..

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.
Similar News
News April 10, 2025
రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం లారీ ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ రాజానగరం మండలం జి.యర్రంపాలెం గ్రామానికి చెందిన మోటర్ సైకిలిస్టు శ్రీను (50) రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తణుకు మండలం వేల్పూరులోని మేనకోడలి ఇంటి వద్ద నుంచి జి.యర్రంపాలెం గ్రామం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం ఏఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు.
News April 9, 2025
రాజమండ్రి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళ మోసం

ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నలుగురు వ్యక్తులకు టోకరా వేసిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. స్థానిక జీజీహెచ్లో తనకు అధికారులు తెలుసునని..ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6.50లక్షలు వసూలు చేసింది. అనంతరం ఆమె ముఖం చాటేయడంతో మోసపోయామని తెలుసుకున్న నలుగురు బాధితులు మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లక్ష్మి సూర్యప్రభకు వారు ఫిర్యాదు చేయగా ఘటనపై ఆమె ఎంక్వైరీ ప్రారంభించారు.
News April 9, 2025
తూ.గో: అకాల వర్షాలతో అవస్థలు

తూ.గో జిల్లాలో అకాల వర్షాలతో అవస్థలు తప్పడం లేదు. వర్షంతో పంట నష్టం జరుగుతోంది. పిడుగులు సైతం పడుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెనికి చెందిన వెలగాని సత్యనారాయణ(46) సైతం నిన్న పిడుగుపడి చనిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఆయన ఇటీవల గ్రామానికి వచ్చి చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకండి.