News January 10, 2025

KKD: కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలు అమలుకు కమిటీలు

image

సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది .ఈనేపథ్యంలో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు గురువారం కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఎస్సై, తాహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వీఆర్వోలతో బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని ఆదేశించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు.

Similar News

News September 15, 2025

తూ.గో: నేడు కలెక్టరేట్‌లో PGRS

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.

News September 14, 2025

రాజమండ్రి ఎంపీకి 7వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరికి 13వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

News September 14, 2025

రాజమండ్రి: లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారం

image

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్‌‌ఛార్జ్‌ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.