News January 10, 2025
విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లు

విశాఖ- సికింద్రాబాద్ (20833/34)వందే భారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. జనవరి 11 నుంచి వందే భారత్ రైలు 20 కోచ్‌లతో నడుస్తుందన్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 బోగీలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News January 6, 2026
విశాఖ: గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖలో మంగళవారం పలు చోట్ల గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలలో అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యువత భవిష్యత్తు రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వైజాగ్ సిటీ పోలీసులు తెలిపారు.
News January 6, 2026
విశాఖ జూలో జనవరి 8 నుంచి ‘వింటర్ క్యాంప్’

విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో జనవరి 8 నుంచి 11 వరకు చిన్నారుల కోసం ‘జూ వింటర్ క్యాంప్’ నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే ఈ క్యాంప్‌లో వెటరినరీ హాస్పిటల్ సందర్శన, జంతు సంరక్షకులతో ముఖాముఖి వంటివి ఉంటాయి. పాల్గొనే వారికి టీ-షర్ట్, సర్టిఫికెట్, 10 సార్లు ఉచిత ప్రవేశం కల్పించే ‘జూ పాస్‌పోర్ట్’ అందజేస్తారు.
News January 5, 2026
మహిళల భద్రతకు సఖి వాహనం: కలెక్టర్

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.


