News March 17, 2024
బొప్పూడి బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం

చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
Similar News
News January 26, 2026
బ్రాహ్మణకోడూరు విద్యార్థి అక్షర విజయం.. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం!

పొన్నూరు(M) బ్రాహ్మణకోడూరు MPPS 1వ తరగతి విద్యార్థి షేక్ సమాన్ మాలిక్ రాష్ట స్థాయిలో చేతిరాత పోటీలలో ప్రథమ స్థానం పొందాడు. క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో గుంటూరులో విద్యార్థి సమాన్ మాలిక్‌ను DEO సలీం బాషా అభినందించి ప్రశంసా పత్రం, షీల్డ్, రూ. 2 వేల నగదు బహుమతి ప్రధానం చేశారు. విద్యార్థి సమాన్ మాలిక్‌ను పొన్నూరు MEOలు రాజు, విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.
News January 26, 2026
GNT: సీఎం క్యాంప్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News January 26, 2026
GNT: గణతంత్ర వేడుకల బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఎస్పీ

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.


