News January 10, 2025
RR: రూ.4000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్లు
HYDలో రూ.3619 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్లు, రూ.1487 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.1,900 కోట్ల భూసేకరణ పరిహారానికి వెచ్చించనున్నారు. మరోవైపు రూ.4,000 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సంబంధించిన భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి సర్వే ప్రకారం పూర్తి చేశారు.
Similar News
News January 10, 2025
HYD: రేపటి నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్
20 కోచుల సామర్థ్యం కలిగిన ఆరెంజ్ వందే భారత్ రైలు రేపు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు వివిధ ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ పూర్తి చేసినట్లుగా తెలిపారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్, విశాఖపట్నం, పూనే మార్గాల్లోనూ వందే భారత్ రైల్వే సేవలు అందిస్తున్నారు.
News January 10, 2025
తిరుపతికి క్యూ కట్టిన ప్రజాప్రతినిధులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, డోర్నకల్ MLA రామ చంద్రనాయక్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మల్కాజ్గిరి నాయకులు రాము, ఇతర నేతలందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం తిరుమల తిరుపతికి చేరుకున్నారు.
News January 10, 2025
HYD: కుంభమేళాకు వెళ్తున్నారా..? ఇది మీకోసమే!
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే వారికి IRCTC రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కుంభమేళా వద్ద ఉండటం కోసం ప్రయాగ్ రాజ్ కుంభమేళలో టెంట్ బుక్ చేసుకోవచ్చని, సూపర్ డీలక్స్ అండ్ విల్లా సదుపాయం ఉందని, IRCTC టెంట్ సిటీ ఏర్పాటు చేసినట్లు HYD అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు 1800110139కు కాల్ చేసి, irctctourism.com వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.