News January 10, 2025
భార్యాభర్తలూ.. పిల్లల ముందు ఈ పనులు వద్దు
ఐదేళ్ల లోపు చిన్నారులు మనం మాట్లాడే మాటలు, చేసే పనులను చూసి చాలా నేర్చుకుంటారు. అందుకే వారి ముందు ఆర్థిక సమస్యల గురించి చర్చించుకోకండి. వారికేం అర్థమవుతుందిలే అనుకోవద్దు. అలాగే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడకండి. అది వారి మానసిక ఆరోగ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వారూ అలానే అరిచే అవకాశం ఉంటుంది. ఇక పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే పెద్దవాళ్ల పట్ల గౌరవం చూపకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది.
Similar News
News January 10, 2025
హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్
టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.
News January 10, 2025
రూ.700 కోట్ల లాభాలు ఎక్కడో కేటీఆర్ చూపాలి: బండి సంజయ్
TG: ఈ-కార్ రేస్ కేసులో KTR అరెస్టయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయనేమైనా దేశం కోసం పోరాడారా అని ప్రశ్నించారు. KCR, రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని, అందుకే కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. KCR ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.
News January 10, 2025
టీమ్ ఇండియా టార్గెట్ 239 రన్స్
భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తీ శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.