News January 10, 2025
ఇంట్లో ఐదుగురు మృతి.. బెడ్ బాక్స్‌లో పిల్లల శవాలు
UPలోని మీరట్‌లో ఓ ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభించడం కలకలం రేపింది. భార్యాభర్తల శవాలు హాల్లో గుర్తించగా వారి పదేళ్లలోపు ముగ్గురు ఆడపిల్లల డెడ్‌బాడీలు బెడ్ బాక్స్‌లో కనిపించాయి. అందరి తలలపై ఆయుధంతో బలంగా కొట్టడంతో తీవ్రమైన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నుంచి అనుమానాస్పదంగా ఇంటికి తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్ల సమాచారంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 10, 2025
ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
AP: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఈ ఒప్పందం జరిగింది. జనరేట్ ఏఐని ఉపయోగించేలా ఫ్లాట్‌పామ్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు
‘గేమ్ ఛేంజర్’ సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలు కురిపించారు. ‘చరణ్.. అప్పన్న క్యారెక్టర్‌లో ఇరగదీశావ్. ఆ పాత్రకు జీవం పోశావ్. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా మారినట్లు అనిపించింది. ఈ సినిమాను అందించినందుకు శంకర్‌కు ధన్యవాదాలు. నాకు చరణ్ నటించిన మూవీల్లో మగధీరలో హర్ష& కాలభైరవ, ఆరెంజ్‌లో రామ్, రంగస్థలంలో చిట్టిబాబు, RRRలో అల్లూరి సీతారామరాజు ఇప్పుడు అప్పన్న పాత్రలంటే ఇష్టం’ అని తెలిపారు.
News January 10, 2025
TTD ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలేవీ: అంబటి
AP: తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వీరిపై సీఎం చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘అసలు బాధ్యులను వదిలేసి వేరేవారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేయడం ఏంటీ? అసలైన బాధ్యులు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబుకు పాపం తగులుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.