News January 10, 2025

మహా కుంభమేళాలో గాయకుల ప్రదర్శనలు

image

ఈనెల 13 నుంచి ప్రారంభంకానున్న మహా కుంభమేళాకు UP సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను అలరించేందుకు గాయకులతో పాటలు పాడించనుంది. శంకర్ మహదేవన్, హరిహరణ్, షాన్ ముఖర్జీ, కైలాశ్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, మాలిని అవస్తీ తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న మేళా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 7, 2025

ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పట్లో ఉంటుందా?

image

ప్రభాస్‌తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీగా ఉందని, హీరో డేట్స్ దొరకడమే ఆలస్యమని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నారు. తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 లైన్‌లో ఉన్నాయి. అటు ప్రశాంత్ ‘జై హనుమాన్’ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా రావడానికి మరింత టైమ్ పట్టే ఛాన్సుంది.

News September 7, 2025

ఏ దేవుణ్ని ఏ సమయంలో పూజిస్తే మంచిది?

image

మన ఇష్ట దైవాన్ని ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయని పండితులు అంటున్నారు. వాటి ప్రకారం.. సూర్యుణ్ని ఉదయం 6 గంటల లోపు పూజించాలి. అప్పుడే రాముడు, వేంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. శివుణ్ని ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మధ్యాహ్నం వేళ హనుమంతుణ్ని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. లక్ష్మీదేవి పూజకు రాత్రి 6-9 అనువైన సమయం.

News September 7, 2025

నేడే చంద్ర గ్రహణం.. టైమింగ్స్ ఇవే

image

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి.8.58 గంటలకు గ్రహణం ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను ఇవాళ కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.